Revanth reddy: గజ్వేల్ నియోజక వర్గంలో సీఎం రేవంత్ పర్యటన ..... ! 20 d ago
సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ లో రూ. 1000 కోట్లతో నిర్మించిన కోకాకోలా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ప్లాంట్ మొత్తం పరిశీలించారు. కూల్ డ్రింక్ ఎలా తయారు చేస్తారని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించడం ఇదే మొదటిసారి. సీఎం వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.